ఎప్స్టీన్ ఫైల్స్లో అనిల్ అంబానీ
లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన పత్రాల్లో భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన కొత్త విషయాలు బయటపడ్డాయి.
- సంభాషణల్లో స్వీడిష్ మహిళ ప్రస్తావన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన పత్రాల్లో భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన కొత్త విషయాలు బయటపడ్డాయి. ఈ పత్రాలు 2017-2019 మధ్య ఎప్స్టీన్, అనిల్ అంబానీ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించినవి. బ్లూమ్బర్గ్ కథనం ప్రకారం ఈ చర్చలు వ్యాపారం, ప్రపంచ వ్యవహారాలతోపాటు మహిళలను ప్రస్తావించాయి. 2017 మార్చి 9న జరిగిన ఈ-మెయిల్ సంభాషణలో ఎప్స్టీన్ని అనిల్ మీ సూచన ఏమిటని అడిగారు. దీనికి ఎప్స్టీన్ మీటింగ్ సరదాగా సాగేందుకు ఒక పొడవైన స్వీడిష్ అందగత్తె ఉంటే మంచిది అన్నారు. దీనికి అనిల్ అంబానీ ఏర్పాటు చేయండి అని బదులిచ్చారు. అంతర్జాతీయ ప్రయాణాలు, వ్యాపారం, సమావేశాలు, ప్రపంచ వేదికలపై వేడులకు సంబంధించి అనిల్ అంబానీ, ఎప్స్టీన్ మధ్య చర్చలు జరిగినట్లు ఇతర ఈ-మెయిల్స్ వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

