హైదరాబాద్, ఫిబ్రవరి 7: లగ్జరీ వాచ్‌ల విక్రయ సంస్థ రమేశ్ వాచ్ కంపెనీ మరో అంతర్జాతీయ బ్రాండ్ చేరింది. బ్రిటన్‌కు చెందిన బ్రిటైమ్ లండన్ బ్రాండ్ గడియారాలను కూడా తమ స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ ఎండీ రోహిత్ చుగాని తెలిపారు. ఈ గడియారాలు రూ.18 వేలు మొదలుకొని రూ.50 వేల స్థాయిలో లభించనున్నాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 11 అవుట్లెట్లు ఉన్నాయని, మరోరెండు నెలలో వైజాగ్‌లో రెండు స్టోర్లను ఒకేసారి ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో లగ్జరీ వాచ్‌ల మార్కెట్‌ను మరింత విసృత పరుచాలనే ఉద్దేశంతో వచ్చే నాలుగేండ్లలో ద్వితీయ శ్రేణి నగరాల్లో మరో 11 స్టోర్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా రూ.15 వేల కోట్ల స్థాయిలో ఉన్న లగ్జరీ వాచ్‌ల మార్కెట్ ప్రతియేటా 25-30 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందన్నారు.