చర్లపల్లి, ఫిబ్రవరి 25 : ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చర్లపలి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ మన బస్తీ – మన బడి ’ కార్యక్రమంపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ రేష్మ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలల ‘ మన బస్తీ – మన బడి’ కార్యక్రమం పుస్తకాన్ని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆవిష్కరించారు. అనంతరం కుషాయిగూడలో విద్యుత్ సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మన బస్తీ, మన బడి కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ కోసం కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, కనకరాజుగౌడ్, బత్తుల శ్రీకాంత్‌యాదవ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.