బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
సిటీబ్యూరో/చిక్కడపల్లి, డిసెంబర్ 22: దేశ నిర్మాణానికి ఎంతో మంది విద్యార్థులను వెంకటస్వామి(కాకా) స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థ అందించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో మాజీ కేంద్ర మంత్రి జి.వెంకట్ స్వామి 9వ వర్ధంతి, పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై వెంకట్ స్వామి విగ్రాహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, విద్యాసంస్థల చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకట్ స్వామి, కార్యదర్శి, ఎమ్మెల్యే వినోద్, కరస్పాడెంట్ సరోజా, రమ, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకుర్, కేఎల్.నాగరాజు, ప్రొఫెసర్ లింబాద్రీ, పురుశోత్తం, రిటైడ్ జస్టిస్ చంద్రకుమార్, విమలక్క, పాల్గొన్నారు.