సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బయోడిజైన్ను ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిషరణలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బయోటెక్, ఫార్మా, మెడికల్ టెక్నాలజీలో నగరం తయారీ రంగం నుంచి నూతన ఆవిషరణల స్థాయికి ఎదిగిందన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో నిర్వహించిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్‌కు సీఎం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అద్భుతమైన విద్యాసంస్థలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యాలు ఉన్నాయని, ఫలితంగా నగరంలో గొప్ప శ్రామికశక్తి ఉందన్నారు. భారతదేశ వైద్య అవసరాలను తీర్చడానికి స్వదేశీ ఆవిషరణలు అవసరమని, ఆవిషర్తలు, పరిశోధకులకు సంబంధించిన డేటా గోప్యతను ఖచ్చితంగా పాటిస్తామన్నారు.
అకడమిక్ ఇన్ స్టిట్యూట్లు, రీసెర్చ్, ఇన్నోవేషన్ బాడీలు, యంగ్ ఇండియా సిల్స్ యూనివర్శిటీ, కార్పొరేషన్లకు కనెక్ట్ చేస్తామని వైద్యులనుద్ధేశించి చెప్పారు. మెడ్ టెక్‌లో బయోడిజైన్ను ఉపయోగించి పరిశోధనలు చేసేందుకు చొరవ చూపిన ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఐజీ దవాఖాన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.