రంగారెడ్డి, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/ బడంగ్‌పేట: తెలంగాణ హరిత స్ఫూర్తి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘హరితోత్సవం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ సరిహద్దులోని మ్యాక్ ప్రాజెక్టు వద్ద ఉన్న ఫారెస్టు పార్కులో మొక్కలను నాటనున్నారు. అనంతరం పక్కనే ఉన్న గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరుకానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టింది. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం పరిశీలించారు. సీఎం కేసీఆర్‌కు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రహదారులు, కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు, తోరణాలు, ఆర్చీలతో తుమ్మలూరు ప్రాంతం గులాబీ మయమైంది.
మ్యాక్ ప్రాజెక్టు వద్ద ఉన్న ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటే ప్రాంతానికి ఉదయం 8.30 గంటలకు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ ఏకకాలంలో 25వేల మొక్కలు నాటేలా అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ మొక్కలు నాటిన తర్వాత నేరుగా మ్యాక్ ప్రాజెక్టు పక్కనే ఉన్న మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హరితహారంపై లఘుచిత్ర ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పార్కింగ్ ఇలా..
ఏర్పాట్ల పరిశీలన..
సీఎం పర్యటన సందర్భంగా తుమ్మలూరు వద్ద ఏర్పాట్లను ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సభా స్థలిని, బహిరంగ సభ నిర్వహించే గ్రౌండ్‌ను పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, కలెక్టర్ హరీష్, ఐఎఫ్ఎస్, పీసీపీఎఫ్ రాకేశ్ దొబ్రియల్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, అటవీశాఖ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
హరితోత్సవాన్ని విజయవంతం చేయాలి..
మహేశ్వరం మండలానికి సీఎం కేసీఆర్ రాక సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు చురుకుగా పనులు కొనసాగుతున్నాయి. సభాస్థలికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నాము. మండలంలో ఇప్పటి వరకు మూడు వందల కోట్లకు పైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని హరితోత్సవాన్ని విజయవంతం చేయాలి.
– నర్సింహులు, మహేశ్వరం ఎంపీడీవో
తుమ్మలూరుకు సీఎం కేసీఆర్ రావడం చాలా ఆనందంగా ఉంది
హరితోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ తుమ్మలూరు ఫారెస్టు అర్బన్ పార్కుకు రావడం ఇక్కడి ప్రజల అదృష్టం. ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ రావడంతో మా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీచైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి మహేశ్వరం మండలంతోపాటు తుమ్మలూరు గ్రామానికి అధిక నిధులను వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు.
-మద్ది సురేఖ కరుణాకర్ రెడ్డి, తుమ్మలూరు సర్పంచ్
సీఎం పర్యటన నేపథ్యంలో..
ఓఆర్ఆర్ నుంచి కందుకూర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హరితోత్సవంలో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కుకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండటంతో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలున్నాయని, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కొన్ని రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేయడం చేపడుతున్నట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ-2 శ్రీనివాస్ తెలిపారు. తక్కుగూడ నుంచి కందుకూరు వెళ్లే రూట్లో నిర్ణీత సమయంలో ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు- పార్కింగ్ స్థలాలు