వడ్ల కొనుగోలు నిర్ణయంపై హర్షాతిరేకాలు
సీఎంకు క్షీరాభిషేకాలు
మేడ్చల్ రూరల్ /శామీర్‌పేట/జవహర్‌నగర్, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. తెలంగాణలో పండిన ప్రతి వండ్ల గింజను కొంటామని, ఏ రైతు కూడా మద్ధతు ధర కంటే తక్కువ అమ్ముకోవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చిన నేపథ్యం లో బుధవారం నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, మూడుచింతపల్లి, కీసర, జవహర్‌నగర్ కార్పొరేషన్లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతూ వడ్లను కొనలేమని చేతులెత్తేస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజను కొనేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. బీజేపీ నాయకులతో రాష్ర్టానికి ఒరిగిందేమి లేదని అన్నారు.
మండలంలోని గౌడవెల్లిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్, మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, డబిల్‌పూర్‌లో సర్పంచ్ గీతారెడ్డి, టీఆర్ఎస్ నేత భాగ్యారెడ్డి, మునీరాబాద్‌లో సర్పంచ్ సర్పంచ్ గణేశ్, లింగాపూర్‌లో సర్పంచ్ బైరి లక్ష్మీసంజీవయ్య, రాయిలాపూర్‌లో టీఆర్ఎస్ నేతలు మెట్టుగోపాల్, శ్రీకాంత్ రెడ్డి, రాజబొల్లారంలో మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మేడ్చల్ మున్సిపాలిటీలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకాలు చేశారు.
శామీర్పేటలోఎంపీపీ ఎల్లూబాయిబాబు, సర్పంచ్ బాలమణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్‌లతో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జవహర్‌నగర్‌లో టీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.