పీర్జాదిగూడ,అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మేడిపల్లి ఎస్వీఎం గ్రాండ్లో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఆశీర్వాద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కార్పొరేషన్ పరిధిలోని సుమారు వెయ్యిమంది సీనియర్ సిటిజన్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రితో పాటు మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, ఇది చూసి కాగ్రెస్, బీజేపీ నేతలు ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు. బీఆర్ఎస్ సర్కారు 10 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసిందననారు. సీనియర్ సిటిజన్లు అందరూ ఒక కుటుంబంలా ఉండాలని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్ల ఆదరణతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోనే 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణేనని అన్నారు. అనంతరం సీనియర్ సిజిటిన్లు బీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మా మద్దతూ మంత్రిమల్లారెడ్డికే అని తెలిపారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు హరిశంకరెడ్డి, అనంతరెడి,్డ యుగేంధర్‌రెడ్డి, పోచయ్య, బచ్చరాజు, రాజేశ్వరాఅంజిరెడ్డి, ప్రసన్నలక్ష్మీ శ్రీధర్‌రెడ్డి, నాయకుల కృష్ణగౌడ్, బుచ్చియాదవ్, దేవేందర్‌గౌడ్, మహేశ్, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.