సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపారు.
పెద్దమ్మ గుడిలో మేయర్ పూజలు
బంజారాహిల్స్, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయడం ఖాయమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో నిర్వహించిన విశేష హోమం కార్యక్రమంలో, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయుష్షు హోమం, సికింద్రాబాద్ గణేశ్ ఆలయంలో చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజ లు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డితో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం భవన్ వద్ద పెద్ద సంఖ్యలో బంజారా మహిళలతో కలిసి ఆడిపాడారు.
చాదర్ సమర్పణ
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా యూసుఫెన్ దర్గాలో చాదర్ సమర్పించిన రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీఉల్లా ఖాన్, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఎంకే బద్రుద్దీన్, తదితరులు
న్యూ ఢిల్లీలో
న్యూ ఢిల్లీలోని 23వ తుగ్లక్ రోడ్డులో సీఎం వ్యక్తిగత కార్యదర్శి అమరేందర్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురష్కరించుకొని అన్నదానం చేస్తున్న దృశ్యం
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద కేక్ కటింగ్ చేసి, మొక్కలు నాటిన అనంతరం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదానం చేస్తున్న ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
కీసర ఈకో పార్క్‌లో మొక్కలు నాటిన..
ఎంపీ సంతోష్‌కుమార్, మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కీసరలోని పెద్దమ్మ చెరువు సమీపంలోని ఈకో పార్క్‌లో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంతకుముందు కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ పేరిట పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్‌రెడ్డి, మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, మేకల కావ్య, మున్సిపల్ చైర్మన్లు ప్రణీత, కొండల్‌రెడ్డి, చంద్రారెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, కీసర సర్పంచ్ మాధవి, తదితరులు పాల్గొన్నారు.
విశేష పూజలు జరిపిన ఎమ్మెల్సీ కవిత
అమీర్‌పేట్, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో రాజశ్యామల యాగం జరిపించారు. దేవాలయ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వెంకటరమణ శర్మ, రాజీవ్దత్త శర్మ, రామనాథ శర్మ తదితరులు ఈ యాగం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ ఆయుష్కు కావాలని కోరుకుంటూ మృత్యుంజయ హోమం జరిపించారు. ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అర్చకులు అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఉదయం సీఎం కేసీఆర్ గోత్ర నామాల పేరుతో పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దాతలు సమకూర్చిన అమ్మవారి ఆభరణాలను ఈవో ఎస్.అన్నపూర్ణ, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్‌లకు అందజేశారు. అనంతరం దేవాలయం ఆవరణలో మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, బీఆర్ఎస్ నాయకులు అర్కోల్ల రాజు, హనుమంతరావు, సంతోష్, మణికుమార్, తదితరులు పాల్గొన్నారు.
పీవీ మార్గ్‌లో సీఎం జన్మదిన వేడుకలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): పీవీ మార్గ్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కుమార్, కోలేటి దామోదర్, సోమా భరత్‌కుమార్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, గ్యాదరి బాలమల్లు, రాంచందర్ నాయక్, తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా జబర్దస్త్ కళాకారులు రాజమౌళి, అప్పారావు, కార్తీక్, నవీన్, తన్మయి బృందం చేసిన కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒకరినీ కడుపుబ్బ నవ్వించింది. అదేవిధంగా కేసీఆర్ జీవిత చరిత్ర, రాజకీయ నేపథ్యంతో రూపొందించిన డాక్యుమెంటరీని వీక్షించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేక్ తినిపిస్తున్న పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త
ఎమ్మెల్యే క్యాంప్‌కార్యాలయంలో మొక్కలకు నీరు పోస్తున్న డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావుగౌడ్,కార్పొరేటర్ సామల హేమ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు
బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ వద్ద బంజారా మహిళలతో కలిసి నృత్యాలు చేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ఎమ్మెల్యే దానం నాగేందర్
తెలంగాణ బెంగాలి సమితి ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద 69 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు దీపాంకర్‌పాల్, తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం మండలం గడికోటలో కేక్ కట్‌చేసి స్థానికులకు తినిపిస్తున్న మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్