సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12 వ తరగతిని పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను కనబరిచినందకు గాను హిమాన్షుకు సీఏఎస్ ఎక్స్లెన్స్ అవార్డును అందజేశారు.
Hyd
గ్యాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు పట్టాను తన తాత కేసీఆర్ చేతిలో పెట్టి దీవెనలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో హిమాన్షు తాత, నానమ్మ సీఎం కేసీఆర్, శోభ దంపతులు, తల్లిదండ్రులు, కేటీఆర్, శైలిమ, చెల్లెలు అలేఖ్య, హిమాన్షు అమ్మమ్మ శశిరేఖ, మేనమామలు రాజేందర్ ప్రసాద్ పాకాల,
శైలేందర్ ప్రసాద్ పాకాల ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బండ్ల గణేశ్ తనయులు..
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ కుమారులు (కవలలు) హితేశ్, హిరేశ్ సైతం ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12 వ తరగతిని పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు.
గచ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 12వ తరగతిని పూర్తిచేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న అద్వైత్ బిగాలతో తల్లిదండ్రులు మహేశ్ బిగాల (బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ ), షాలిని బిగాల