
సిటీబ్యూరో, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం తర్వాత చీకటిమయం అవుతుందన్న అపోహలను తిప్పికొడుతూ, అతి తక్కువ సమయంలోనే నిరంతర వెలుగుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రాష్ట్ర విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంజయ్య అన్నారు. ఆదివారం ఆర్టీసీ కల్యాణ మండపంలో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో పాల్గొన్న అంజయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త విద్యుత్ చట్టాలు, డిస్కంలను ప్రైవేటీకరణ చేసే కుట్రలను తిప్పి కొట్టేందుకు మరో ఉద్యమానికి సభ్యులందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గ సభ్యులు నిరంతరం శ్రమించాలన్నారు.
టీఎస్ఎస్పీడీసీఎల్ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా డి.వీరస్వామి, కార్యదర్శిగా కె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా వి.శ్రీకాంత్, బి.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.కొండారెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీగా డి.గోవర్ధన్, మహిళా కార్యదర్శిగా పి.జానకి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎ.నాగరాజు, రాజేశ్, సంయుక్త కార్యదర్శులుగా జానయ్య, సువిహార్ రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా అజయ్‌కుమార్, హనుమ, సమ్మయ్య, పరమేశ్, హరీశ్ వ్యవహరించారు.