మేడ్చల్, ఆగస్టు 31: కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ సాధ్యపడుతుందని సీఎం విద్యా సంస్థల వైస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, సీఈవో చామకూర అభినవ్ రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ప్రథమ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ విద్యార్థులకు నాలుగేండ్ల ఇంజినీరింగ్ కోర్సు కాలం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కాలమే భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు.
ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అనుక్షణంపై చదువుపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుత పోటీల ప్రపంచంలో నెగ్గాలంటే సమాచార, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ కార్యదర్శి శ్రీశైలం రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్ఆండ్ఎస్ హెచ్‌వోడీ కేవీ రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ విజయ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.