సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): జాబితాలో తప్పుల సవరణ చేసినప్పుడే స్పష్టమైన ఓటరు జాబితాను తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులు డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ అన్నారు. రెండో సమ్మరీ రివిజన్లో భాగంగా ఇటీవల ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎమ్మెల్యేలతో మంగళవారం రోల్ అబ్జర్వర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటరు జాబితా పరిశీలన నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోలేదని, బూత్ లెవెల్ అధికారితో పాటు ఏజెంట్ కలిసి ఇంటింటికీ తిరిగి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తేనే స్పష్టమైన ఓటరు జాబితా తయారు అవుతుందని తెలిపారు.
తప్పుల సవరణపై పరిశీలన
– రోనాల్డ్ రోస్, జిల్లా ఎన్నికల అధికారి
ఓటరు జాబితాపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఇంటింటికీ తిరిగి పరిశీలన చేసి, నివేదిక ఇవ్వడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఆర్ఓను రోల్ ప్రత్యేక అధికారిగా నియమించినట్లు చెప్పారు. ఇంటింటికీ బీఎల్ఓలు మరోసారి తిరుగుతున్నారని, ఓటరు జాబితాలో తప్పుల సవరణ చేస్తున్నారని చెప్పారు. తుది ఓటరు జాబితా ఎన్నికల నోటిఫికేషన్లో చివరి నామినేషన్ వరకు తీసుకుంటామని, చివరి నామినేషన్ తేదీ కంటే 10 రోజుల ముందు వరకు నమోదైన అన్ని దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామన్నారు.
ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ మార్పులపై నియోజకవర్గ పరిధిలో ప్రతి బుధవారం జరిగే పొలిటికల్ పార్టీ సమావేశంలో చర్చించాలని కమిషనర్ కోరారు. దరఖాస్తుపై తప్పనిసరిగా అభ్యర్థి సంతకం ఉంటేనే పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఒకవేళ ఓటరు జాబితాలో పేరు తొలిగింపునకు ప్రతి బుధవారం జరిగే సమావేశంలో పొలిటికల్ పార్టీల అనుమతితోనే తొలిగింపు చేయాలని ఈఆర్ఓలను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన ఓటర్ల సంఖ్య కంటే ఎకువ ఉంటే ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు.
పార్టీల నేతలు ఏమన్నారంటే..?