INTUC | హైదరాబాద్‌లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకుల మధ్య గొడవ జరిగింది. ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గీయులపై ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గీయులు దాడికి దిగారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఐఎన్టీయూసీ(ఆర్) నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న ఐఎన్టీయూసీ నేత సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్, ఇతర వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అంబటి వర్గీయులు సైతం సంజీవరెడ్డి వర్గీయులపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే రంగంలోకి దిగిన అబిడ్స్ పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తన్నుకున్న కాంగ్రెస్ యూనియన్ నాయకులు
హైదరాబాద్ – బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకులు మధ్య గొడవ
ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ
ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి
ప్రెస్ క్లబ్… pic.twitter.com/mumpglLIGU
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2025
ఈ సందర్భంగా అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సంజీవరెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించారు. ఆ ఆరోపణలను ఖండించేందుకు ప్రెస్‌మీట్ పెడితే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.