సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో వివిధ విభాగాల్లో ఉత్తమ బాధ్యతలు నిర్వర్తించిన సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి రివార్డులు అందించారు. ఎలక్షన్ సెల్, పోస్టల్ బ్యాలెట్ వింగ్, సిటీ ఆర్మూడ్ రిజర్వు, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఆర్మాస్ సెక్షన్, మెయిన్ కంట్రోల్ రూం, ఐటీ సెల్, ఐసీసీసీ బిల్డింగ్ స్టాఫ్, శాంతి భద్రతల విభాగం సిబ్బంది రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావారణంలో నిర్వహించడంలో అందరూ కలిసికట్టుగా పనిచేశారని సీపీ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, సత్యనారాయణ, జాయింట్ సీపీలు పాల్గొన్నారు.