Shekhar Kammula | బన్సీలాల్ పేట్, మార్చి 21 : బిజినెస్ మేనేజ్మెంట్ రంగాన్ని ఎంచుకున్న యువత అందులోని మెళకువలను నేర్చుకుని, సృజనాత్మకత, సాంకేతికతను వినియోగించుకుని, వ్యాపారాలు మొదలుపెట్టి, భవిష్యత్తులో గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని, తమతో తల్లిదండ్రులకు, కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు.
సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని సర్దార్ పటేల్ కళాశాలలో శుక్రవారం ”సమన్వయ” పేరుతో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కళాశాల పాలకమండలి చైర్మన్ హరినాథ్ రెడ్డి, కార్యదర్శి బీవీ రంగారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ హేమలత, వైస్ ప్రిన్సిపాల్ అమర్నాథ్ శర్మ, ఎంబిఎ డైరెక్టర్ డాక్టర్ అనుప యాదవ్, హెచ్.ఓ.డి.పల్లవి, పరిపాలనా అధికారి రాహుల్ యాదవ్ పాల్గొన్నారు.