నార్కెట్పల్లికి చెందిన విద్యార్థిని వైష్ణవి టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆదివారం నగరానికి ఆటోలో వచ్చారు. ఆటో డ్రైవర్ తప్పిదం వల్ల నారాయణగూడ గురునానక్ హైస్కూల్ వద్ద దిగారు. ఆ తర్వాత హాల్ టికెట్ చూసుకోగా, అందులో పరీక్ష కేంద్రం అంబర్‌పేట పటేల్‌నగర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అని ఉన్నది.
సమయం తక్కువగా ఉండటంతో అక్కడికి ఎలా వెళ్లాలో తెలియక కన్నీరుపెట్టుకున్నారు. గమనించిన సీఐ చంద్రశేఖర్ వెంటనే పెట్రోలింగ్ వాహనంలో వైష్ణవిని పరీక్ష కేంద్రానికి సమయానికి తీసుకెళ్లారు. పరీక్ష రాసి వచ్చిన వైష్ణవి..పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు.
-హిమాయత్‌నగర్