Hyderabad | ఎర్రగడ్డ, మే 31 : ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్ సమీపంలోని మైదానంలో చిన్నారులకు అథ్లెటిక్ అంశాల్లో ఉచిత శిక్షణ గత ఐదారు ఏండ్లుగా కొనసాగుతున్నది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్లలో ఇద్దరు చిన్నారులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించారు. శనివారం ఆ ఇద్దరు చిన్నారులైన దీనా, దేదీప్లను ట్రాన్స్ కో అధికారి కళ్ళెం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు అభినందించారు. శిక్షణ ఇస్తున్న కోచ్ అనిల్ తయ్యప్పను కూడా అభినందించారు. కాగా రాష్ట్ర స్థాయి పోటీలు రేపు(ఆదివారం) జింఖానా మైదానంలో జరుగుతాయని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.