మాదాపూర్, ఆగస్ట్ 26: ఓటు వేయడం మనందరి హక్కు మాత్రమే కాదని, అది మన బాధ్యత అని ప్రధా న ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆధారితమైన ఎన్ఎండీసీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ విచ్చేసి ఎన్ఎండీసీ లిమిటెడ్ చైర్మన్, ఎండీ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్సీ బ్యాంక్ కంట్రీ హెడ్, బ్రాంచ్ బ్యాంకింగ్ అమిత్ సిన్హా, ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియాలతో కలిసి శనివారం 5కె రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని యువకులు శక్తివంతమైన పౌరులతో కలవడానికి ఇంతకంటే మెరుగైన అవకాశం మరొకటి ఉండదన్నారు. యువత అర్బన్ ఎనర్జీ గ్రోత్ ఇంజన్ అని అన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అ న్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, ఓటు వేయడం మనందరి హక్కు అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ఓటింగ్ శాతంలో భారీ అంతరం ఉందని, మనం దీనిని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు. అనంతరం ఎన్ఎండీసీ లిమిటెడ్ చైర్మన్, ఎండీ అమితవ ముఖర్జీ మా ట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవన శైలి వృద్ధికి పునాది అని, ఫిట్నెస్ను తెరపైకి తీసుకురావడంలో వ్యాయామాలు ముఖ్యమైనవని పేర్కొన్నారు.
లేఖదీప్, హైదరాబాద్‌లోని మేధో వికలాంగుల వృత్తి శిక్షణా కేంద్రం వి ద్యార్థులు, ఫెర్నాండెజ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతినిధులు, ఫెర్నాండెజ్ సీడీసీ ద్వారా పేరెంట్ సపోర్ట్ గ్రూ ప్ ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల తల్లిదండ్రు లు, సంరక్షకుల కొరకు సంస్థలు నిర్మించడంలో సహా యం చేస్తున్నదని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వద్దని నినా దం చేస్తూ పలువురు 5 కె రన్లో భాగంగా పరిగెత్తినట్లు చెప్పారు. రన్నింగ్‌లో ప్ర ధాన ఘట్టమైన రన్నింగ్ ఫెస్టివల్‌ను నెక్లెస్ రోడ్డు, పీపు ల్స్ ప్లాజా రోడ్డులో ఫుల్, హఫ్ మారథాన్ ప్రారంభించగా, హైటెక్స్‌లో 5కె రన్‌ను ప్రారంభించారు. మొత్తం కలిపి 21వేల మందికి పైగా రన్నర్లు, 250మంది వాలంటీర్లు, 500 మంది స్వచ్ఛం ద సంస్థలు పాల్గొనగా రన్ లో భాగంగా ఐశ్వర్య, చేతన్ దంపతులు తమ ఆరు నెల ల పాపను వినికిడి లోపం ఉన్న వారి పిల్లలు, బ్లేడ్ రన్నర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల వినియోగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న బాబుల్ ఎన్జీవో వ్యవస్థాపకుడు గంగాధర్ పాండేలు ఈ రన్లో పాల్గొని పరుగులు తీశారు.