ఉప్పల్, ఫిబ్రవరి 2 : చర్లపల్లి భరత్‌నగర్ రైల్వే క్రా సింగ్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం ఈ ఆర్ఓబీ పనులను రోడ్డు భవనాల శాఖ డీఈ రవీందర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఓబీ పనులను వేగవంతం చేశామని, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డిల సహాకారంతో పనులను మరింత వేగవంతం చేసి.. త్వరలో బ్రిడ్జిను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ముఖ్యంగా బ్రిడ్జికు ఇరువైపులా ఫుట్‌పాత్ పనులు చివరిదశకు చేరుకున్నాయ ని, అదేవిధంగా బ్రిడ్జి కింద సర్వీస్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. బ్రిడ్జి వెంట వీధిదీపాలను ఏర్పా టు చేయడంతో పాటు రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, ఎస్సై షఫీ, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్, పద్మారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, గిరిబాబు, రెడ్డినాయక్, గంప కృష్ణ, వినోద్ ముదిరాజ్, ఉపేందర్, శ్యామ్, రాకేశ్ పాల్గొన్నారు.