ఖైరతాబాద్, మార్చి 13 : ఎస్సీ వర్గీకరణలో మాలలు, ఉపకులాలకు తీరని అన్యాయ జరిగిందని మాల సంఘాల జేఏసి చైర్మన్ జి.చెన్నయ్య (Chennaiah) అన్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎంపరికల్ డేటా లేకుండా, కులాల వారీగా గ్రూపులుగా విభించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని చెప్పారు. ఈ వర్గీకరణ ద్వారా ఆయా గ్రూపులలోని కులాల మధ్య కొంత కాలం తర్వాత సూక్ష్మ వర్గీకరణకు డిమాండ్ వస్తుందని, తద్వారా దళిత జాతి మరింత విచ్ఛిన్నమవుతుందన్నారు. మనువాదులకు కూడా కావాల్సింది అదేనని చెప్పారు. దీనిని మందకృష్ణ అమలు చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు.
గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్లకు ముందే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేయాల్సిందని చెప్పారు. కానీ ప్రస్తుతం ఫలితాలు వచ్చిన తర్వాత వర్గీకరణ ఆధారంగా అవకాశాలు కల్పించాలని మందకృష్ణ కోరుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని హితవుపలికారు. మందకృష్ణకు చేతనైతే బీజేపీతో కొట్లాడి కేంద్రంలో బిల్లు పెట్టించాలని డిమాండ్ చేశారు.