హనుమకొండ (ఐనవోలు): ఐనవోలు మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పెరుమాండ్లగూడెం గ్రామానికి చెందిన నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్ రావు, మండల కన్వీనర్‌గా కొండపర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ తంపుల మోహన్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయం మేరకు ఏకగ్రీవంగా ప్రకటించారు. మండలంలో పార్టీ బలోపేతం కోసం ప్రణాళికబద్దంగా ముందు సాగాలన్నారు.
కార్యకర్తల కష్టాసుఖల్లో పలు పంచుకుంటానన్నారు. అనంతరం రజతోత్సవం సభకు గ్రామాల వారి ఇన్చార్జీలను కూడా నియామించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎంగా కేసీఆర్ చేసిన పనులే శ్రీరామరక్ష అన్నారు. మండలంలో చాలా మంది నాయకులకు రాజకీయంగా చేయూతను ఇచ్చాను. పార్టీలతో సంబంధం లేకుండా తోచిన సహాయం చేసిన విషయం గుర్తు చేశారు.