Chalivendras help to quench the thirst | దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం చేస్తాయి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్ : వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం చేస్తాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తపేట గ్రామంలో యువజన నాయకుడు పిల్లి గోపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్చంద సంస్థలు, యువజన సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. వేసవి తీవ్రత ఉన్నందున చల్లని మంచినీరు, మజ్జిగను అందించడం ద్వారా బాటసారులు ఎంతో ఉపశమనం పొందుతారని అన్నారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ మాట్లాడుతూ చలివేంద్రాలను అందుబాటులోకి తేవడం మంచి పరిణామమని అన్నారు. వేసవిలో చల్లని నీటిని అందించే చలివేంద్రాల ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్‌గౌడ్, జీవీ సాగర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు లింగాల రాల్గౌడ్, తోట మహేష్‌యాదవ్, బొగ్గారపు శరత్చంద్ర, శ్వేతారెడ్డి, రూపాసింగ్, నాగలక్ష్మీ, జ్యోతి, తోట శ్రీనివాస్ యాదవ్, బాబు, శంకర్, నిర్వాహకుడు పిల్లి గోపాల్యాదవ్తో పాటుగా పలువురు స్థానికులు పాల్గొన్నారు.

చైతన్యపురి చౌరస్తాలో….. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో….
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త, లియో క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం అధ్యక్షురాలు నిఖితల ఆధ్వర్యంలో చైతన్యపురి చౌరస్తా వద్ద ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ అంజంపల్లి నాగమల్లు, డాక్టర్ జగన్నాథంలు ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ సాయి, లయన్ విద్యాసాగర్, లియో సుప్రీత్, లియో రాకేష్, లియో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

