కుత్బుల్లాపూర్, సెప్టెంబర్15: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వివరించారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి గుండ్లపోచంపల్లిలో హనుమాన్గడ్డ శ్రీ మేరు దవాఖాన ముందు వాకింగ్‌లో భాగంగా నడుచుకుంటు వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి పుస్తెలతాడును తెంపుకునే క్రమంలో మహిళ పుస్తెలతాడును వదలకుండా పట్టుకుంది.
మరో సగం చైన్‌ను లాక్కొని వెళ్లారు. బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా సీసీ టీవీల ఆధారంగా సోమవారం కండ్లకోయలో పట్టుకొని విచారించగా చైన్‌స్నాచింగ్ నిందితులుగా తేలారు. వీరిలో ఢిల్లీకి చెందిన అజయ్శర్మర్వాల్, రాహుల్ సక్సేనా, రాజేశ్‌కుమార్, సాగర్రాంఫాల్లుగా గుర్తించారు. అయితే వీరిపై బోయిన్పల్లి పీఎస్‌లో ద్విచక్రవాహనాల చోరీకి గురైన కేసులు నిర్ధారణ అయ్యాయని, వారి వద్ద లభించిన నాలుగు తులాల బంగారు గొలుసు రెండు ద్విచక్రవాహనాలు, 4 స్మార్ట్ఫోన్లు స్వాధీ నం చేసుకొని రిమాండ్‌కు తరలించిన్నట్లు తెలిపారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి, సీఐ విజయవర్ధన్తో పాటు క్రైం టీం పాల్గొన్నారు.