సుల్తాన్‌బజార్: బ్రిటిష్, నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా 1857 జూలై 17న తుర్రెబాజ్ ఖాన్ నాయకత్వంలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ దాడిలో ఆనాటి తొలి స్వాతంత్య్ర సమరయోధుడు తుర్రెబాజ్ ఖాన్‌తో సహా అనేక మంది అమరులయ్యారన్నారు. బుధవారం సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్, భారత జాతీయ ఉద్యమం ఆధ్వర్యంలో కోఠిలోని తొలి స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నిర్మించిన స్తూపానికి నివాళులర్పించారు.
అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధైర్యానికి మారుపేరుగా నిలిచిన తుర్రెబాజ్ ఖాన్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ ఉద్యమ కన్వీనర్ మోటూరి ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నరసింహ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.