Hyderabad | అమీర్ పేట్, ఫిబ్రవరి 9: భారత డు-కన్నిన్జుకు సంస్థ ఆధ్వర్యంలో జపాన్ షోటోకాన్ కరాటేలో శిక్షణ పూర్తి చేసుకున్న 16 మంది చిన్నారులు ఆదివారం అమీర్‌పేట్‌లోని గురు గోవింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సర్టిఫికెట్లు అందుకున్నారు. వివిధ స్థాయిల్లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న చిన్నారులు కరాటే కోచ్ మురళీధర్ ముదిరాజ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లతో పాటు బెల్టులను అందుకున్నారు.
ఈ సందర్భంగా కరాటే కోచ్ మురళీధర్ ముదిరాజ్ మాట్లాడుతూ చిన్నారుల్లో శారీరిక మానసిక సమతుల్యతకు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ దోహదం చేస్తాయన్నారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ప్రత్యేక ఆసక్తితో శిక్షణ పొందుతున్న మాస్టర్ గౌరీ శంకర్ ముదిరాజ్, లాస్య లకు (పర్పుల్), స్నేహ అర్జున్ లకు (గ్రీన్), శశాంక్, కరిష్మాలకు బ్రౌన్ బెల్టులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారుల తల్లిదండ్రులతో పాటు క్రీడ ఔత్సాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.