Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 9వ తేదీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సె ల్ట్)లో తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవిన్ సౌడ ఒక ప్రకటనలో తెలిపారు.
”ఎ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్ మెంట్” పేరుతో నిర్వహించే రెండు నెలల కోర్సుకు ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు 79899 03001 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.