జగద్గిరిగుట్ట, జూన్ 7 : అగ్ని ప్రమాదంలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. జగద్గిరిగుట్ట పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రింగ్‌బస్తీలో నివాసముండే సాయి (27) ప్రైవేటు ఉద్యోగి. అతడి తల్లిదండ్రులు శనివారం గుడికి వెళ్లగా సాయి ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.
ఈ క్రమంలోనే షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి.. సాయి మంటల్లో కాలిపోయాడు. తల్లిదండ్రులు వచ్చే సరికి గది అంతా పొగలతో నిండి ఉంది. స్థానికుల సాయంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా, అప్పటికే సాయి మృతి చెంది ఉన్నాడు. కాగా, సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి.. సాయి నిద్రిస్తున్న బెడ్‌కు మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు. బాధితుడు తప్పించుకోలేక అక్కడే చనిపోయినట్టు తెలుస్తోంది.