మూసాపేట, డిసెంబర్27: కూకట్పల్లి నియోజకవర్గంలోని డ్రైనేజీ పైప్లైన్లు, రోడ్ల సమస్యలను గత పాలకులు పట్టించుకోకపోవడంతోనే ప్రస్తుతం అనేక సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అల్లాపూర్ డివిజన్లోని జేపీనగర్, రాజీవ్గాంధీనగర్లలో రూ. 50లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం కార్పొరేటర్ సబీహాబేగంతో కలసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్, రోడ్లను వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు స్థానికులు పర్యవేక్షించినప్పుడే నాణ్యమైన అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, డీఈ ఆనంద్, ఏఈ రంజిత్, జలమండలి డీజీఎం రవి, డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, రియాజ్, సలావుద్దీన్, రాంబాబు, ఆషు, తిరుపతి, పార్వతమ్మ, నరసింహారెడ్డి, జగన్, రేవతి, కళ్యాణ్నాయక్, జ్ఞానేశ్వర్, లక్ష్మి, సత్యవతి, ఖాజా, అనసూయ, మీర్జా, అస్లాం, దుర్గ, చిన్న, అమిత్, మల్లికార్జున్, యోగి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.