నగరంలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులే కాదు, వాటి ద్వారా నష్టపోయే బాధితులకు ఇచ్చే పరిహారంలో కూడా మారిపోతున్నది. ప్రాంతానికో తీరుగా, పరిష్కారం చూపుతూ, సర్కారు జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలకు చేపట్టే ప్రాజెక్టులకు భూములు కోల్పోయి ఆందోళనలో ఉంటే.. ఓదార్చాల్సిన సర్కారే పరిహారం విషయంలో వివక్ష చూపుతూ మరింత రోడ్డున పడేలా వ్యవహారిస్తుందనే అభిప్రాయం జనాల్లో వ్యక్తం అవుతుంది. దీనికి ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం కోసం భూములు కోల్పోయిన బాధితులకు నగదు రూపంలో చెల్లింపులు చేసిన సర్కారే.. ఎలివేటెడ్ బాధితులకు మాత్రం టీడీఆర్ బాండ్లతో పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : ఓల్డ్ సిటీ మెట్రో బాధితులకు ఆ సంస్థ పరిహారాన్ని నగదు రూపంలో ఇచ్చింది. ఇప్పటివరకు సగానికి పైగా పరిహారం చెల్లించి, మిగిలిన ఆస్తులను సేకరించేందుకు కసరత్తు చేస్తున్నది. కానీ ఎలివేటెడ్ పరిహారం విషయంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహారిస్తున్న తీరు వివక్షగా కనిపిస్తోంది. ముఖ్యంగా పరిహారాన్ని టీడీఆర్ రూపంలో చెల్లించాలనే అంశమే ఇప్పుడు వివాదాలకు కారణమవుతున్నది. కానీ ఎలివేటెడ్ విషయంలో రక్షణ శాఖ, ఇతర సంస్థల ఆస్తులకు పరిహారాన్ని తేల్చింది. కానీ ప్రైవేటు ఆస్తులను కోల్పోతున్న బాధితులకు పరిహారాన్ని ఏ నిష్పత్తి ప్రకారం ఇస్తారని చెప్పలేదు. కానీ కోల్పోయిన భూమికి తగినట్లుగా టీడీఆర్ బాండ్లను జారీ చేసి చేతులు దులుపుకొనేలా వ్యవహారిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఉప్పల్
– రామాంతారాపూర్
భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో వ్యత్యాసం
మార్గంలో రోడ్డు విస్తరణలోనూ భూములు కోల్పోయిన బాధితులకు పరిహారానికి బదులుగా కోల్పోయిన భూమి విలువకు సమానంగా పరిహారాన్ని అందించారు.. అదే తరహాలో తమకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సర్కారు పట్టించుకోవడం లేదని రాజీవ్ రహదారి భూయజమానుల జేఏసీ నాయకులు సతీష్ తేలుకుంట వివరించారు. ప్రాజెక్టును 120 ఫీట్లకు తగ్గించేంత వరకు భూములు ఇచ్చేది లేదనీ చెబుతున్నా… సర్కారు మాత్రం టీడీఆర్, నోటీసుల పేరిట భయపెడుతుందని మండిపడ్డారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా పరిహారం ఇవ్వడం వల్ల తమకు జరిగే నష్టం ఎప్పటికీ భర్తీ కాదనీ విషయాన్ని సర్కారు గ్రహించాలన్నారు.