సిటీబ్యూరో: ఇన్సూరెన్స్ లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ వ్యాప్తంగా 22 వాహనాలపై కేసులు నమోదు చేశారు. చాలా మంది ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే గట్టెక్కించే ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 84,45,304 వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 58,71539 వాహనాలు ఉండగా, కార్లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.