సిటీబ్యూరో : నిముషానికి రెండు.. ఐదు రోజుల్లో పదిహేను వేలు.. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల సంఖ్య. ఇందులో ఒక్క రాంగ్ రూట్లో నమోదైన కేసులే పన్నెండు వేలకు పైగా ఉన్నాయి. అంటే హైదరాబాద్‌లో వాహనదారులు ఎంత యథేచ్ఛగా ట్రాఫిక్ రూ ల్స్ బ్రేక్ చేస్తున్నారో ఈ కేసుల సంఖ్యేచెబుతున్నది. రాంగ్రూట్లో డ్రైవింగ్, సెల్‌ఫోన్ చూస్తూ వాహనం నడపడం, ట్రిఫుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, అవసరం లేకున్నా.. అనుమతి లేకున్నా ప్రత్యేక హారన్లు ఉపయోగించడం, డ్రంక్ అం డ్ డ్రైవ్.. ఇలా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతుండడంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతున్నది. నిబంధనలు పాటించాలని హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా సిటీ రోడ్ల పై యువత వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 3నుంచి కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో ప్రధానంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, హారన్ల వినియోగం, నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
61 ప్రాంతాల్లో రాంగ్‌రూట్ డ్రైవింగ్
రాంగ్‌రూట్ డ్రైవింగ్ ఎక్కువగా యూటర్న్ల వద్దే జరుగుతున్నదని, నగరంలో ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు రాంగ్‌సైడ్ డ్రైవింగే కారణంగా పోలీసులు గుర్తించారు. కొందరు యూటర్న్ తీసుకునేందు కు ఒకటి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని షార్ట్‌కట్‌లో ప్రయాణిస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండానే డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో 61 ప్రాంతాల్లో అత్యధికంగా రాంగ్రూ ట్ డ్రైవింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గమనించారు. ఇలాంటి ప్రాంతాల్లో వాహనదారులు వన్‌వే, సిగ్నల్స్, యూటర్న్లు, ఫ్లై ఓవర్ల కింద, నో ఎంట్రీ రూట్లో ఎక్కువగా రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేస్తున్నారు.
రద్దీ ఎక్కువగా ఉండే పాతబస్తీ, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో షార్ట్ క ట్ కోసం రాంగ్ సైడ్‌లో వెళ్తున్నారు. ఇలాంటి డ్రైవింగ్ వల్ల ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నెలలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఐదు రోజుల్లో 12వేలకు పైగా రాంగ్‌రూట్, 13వందల నంబర్ ట్యాంపరింగ్ కేసులు, 1200కు పైగా హారన్ దుర్వినియోగం కేసులు నమోదయ్యాయంటే వాహనదారులు ఎంత నిర్లక్ష్యం గా ఉంటున్నారో గమనించొచ్చని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా నగరంలో గత నెల చివరివారంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ల్లో 1320 నమోదు కాగా ఇందులో ఎక్కువగా ద్విచక్రవాహనాలపై వెళ్తున్నవారు, అందులోనూ యువతే ఈకేసుల్లో ఎక్కువగా పట్టుబడుతుండడం గమనార్హం.
సైరన్ల మోతలకు బ్రేక్..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్‌డ్రైవ్‌లో ఇటీవల పంజాగుట్టలో పెంపుడు కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు సైరన్మోగిస్తూ వెళ్తున్న ఆంబులెన్స్ డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నా రు. మరో సంఘటనలో బంజారాహిల్స్ నుంచి మాదాపూర్వైపు వెళ్తున్న ఒక అంబులెన్స్ జూబ్లీచెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ రద్దీలో సైరన్ వేస్తూ వెళ్తుండగా.. అంబులెన్స్‌కు రూట్‌క్లియర్ చేసిన పోలీసులు తీరా లో పల చూస్తే డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. అందులో పేషంట్లే లేరు. ఇటువంటి కేసులు సుమారు గా 1200కు పైగా ఈ వారం రోజుల్లో పోలీసులు గుర్తించారు.
వీటిలో ప్రజాప్రతినిధులు, మాజీలు, కొందరు వీవీఐపీలు మాత్రమే కాకుండా నగరంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ దర్పం ప్రదర్శించేందు కు తమ కార్లకు పోలీ స్, అంబులెన్స్ సైరన్లు బిగించుకుని ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారూ ఉన్నారు. వీరందరిపై కేసులు నమోదు చేయడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. సిటీలో 1500 అంబులెన్స్‌లు ఉండగా వీటిలో 40శాతం అంబులెన్స్‌లు అత్యవసర సేవల పేరుతో మామూలు పనులకూ సైరన్ మోగిస్తూ వెళ్తున్నట్లు గుర్తించారు. అత్యవసరం లేకున్నా సైరన్లు వేసి అంబులెన్స్‌లు నడపడం డ్రైవర్లు అలవాటుగా మార్చుకున్నారు. వారికి వార్నింగ్ ఇచ్చి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని, ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం కలగకుం డా స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు.