బంజారాహిల్స్, నవంబర్ 2: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని జహీరానగర్లో నివాసం ఉంటున్న ఎండీ.తాహెర్ హుస్సేన్(54) అనే వ్యక్తి గ్యాస్ స్టవ్ రిపేరింగ్ చేస్తుంటాడు.
కొంతకాలంగా అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లనుంచి మినీ సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ప్రమాదకరమైన రీతిలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకుడు తాహెర్ హుస్సేన్ వద్ద నుంచి 7 హెచ్పీ సిలిండర్లు, 2 మినీ సిలిండర్లు, 7 ఖాళీ సిలిండర్లు, రీఫిల్లింగ్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై 318(4) బీఎన్ఎస్తో పాటు 7 ఆఫ్ ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.