కాచిగూడ,ఆగస్టు 20 : నిషేదిత గుట్కా ప్యాకెట్లను అమ్ముతున్న వ్యక్తిపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం కంచన్‌బాగ్‌లోని అఫీస్బాబానగర్ ప్రాంతాని చెందిన మహ్మద్ ఖాజా కుమారుడు మహ్మద్ మసూద్(46)వృత్తి రీత్యా నింబోలి అడ్డాలో సంఘం పాన్‌షాపును నిర్వహిస్తుంటాడు. కొన్ని రోజులుగా మసూద్ నిబంధనలకు విరుద్ధంగా గుట్కా ప్యాకెట్లను అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
విస్వనీయ సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు గురువారం రాత్రి మహ్మద్ మసూద్ నిర్వహించే పాన్‌షాపులో తనిఖీలు చేసి 17 రకాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.