Hayat Nagar : ప్రజా సమస్యలపై వార్తలు రాసిన జర్నలిస్ట్‌ను బెదిరించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదైంది. అశోక్ పగిళ్ల అనే జర్నలిస్ట్ రాసిన వార్తపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైన జక్కిడి శివ చరణ్ రెడ్డి కోపంతో ఊగిపోయాడు. ‘మా కుటుంబ సభ్యుడిపై వార్త రాస్తావా?’ అని అతడికి ఫోన్, వాట్సాప్ కాల్ చేసి బండ బూతులు తిట్టాడు.
అంతటితో ఆగకుండా ‘నీ అంతు చూస్తా? మన్సూరాబాద్‌లో ఎలా తిరుగుతావో చూస్తా?’నని అశోక్‌ను బెదిరించాడు. దాంతో, జర్నలిస్ట్ సంఘాల నాయకులతో కలిసి హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు అశోశ్. శివచరణ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహానీ ఉందని అశోక్ ఫిర్యాదు చేశాడు. అతడిచ్చిన కంప్లైట్ ఆధారంగా శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బాధితుడైన అశోక్‌కు న్యాయం చేయాలని జర్నలిస్ట్‌లు డిమాండ్ చేస్తున్నారు.