Hyderabad | బంజారాహిల్స్, మే 24 : పనిచేస్తున్న సంస్థకు టోకరా వేసిన సీనియర్ ఇంజినీర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం-2లోని విశ్వసముద్ర ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థలో దొంతుల్వార్ రామకృష్ణ అనే వ్యక్తి మూడేళ్లుగా సీనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో పలు సంస్థలకు ప్రయోజనం కలిగించడంతో పాటు వారి వద్ద నుంచి రూ.9,13,488 తీసుకున్నట్లు తేలింది. ఆయా సంస్థలకు ప్రయోజనం కలిగించడం ద్వారా తమ సంస్థకు నష్టం కలిగించడంతో పాటు మోసానికి పాల్పడ్డ రామకృష్ణ మీద చర్యలు తీసుకోవాలంటూ విశ్వసముద్ర సంస్థ జనరల్ మేనేజర్ భవానీ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 316(5), 318(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.