బంజారాహిల్స్,ఏప్రిల్ 4 : ఐపీఎల్ మ్యాచ్‌లపై(IPL match) ఆన్లైన్ బెట్టింగ్‌లు(Betting) స్వీకరిస్తున్న వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..షేక్‌పేటలోని వినాయక్‌నగర్‌లో ఆర్..జగదీష్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.
వైజాగ్‌లో జరుగుతున్న డిల్లీక్యాపిటల్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌పై ‘క్రికెట్ లైన్ గురూ’ ద్వారా బెట్టింగ్‌లు స్వీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కార్వాన్‌లోని వినయ్‌సింగ్ అనే బుకీ ద్వారా జగదీష్ బెట్టింగ్‌లను పాల్పడుతున్నాడని తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.25వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బుకీ వినయ్‌సింగ్ కోసం గాలింపు చేపట్టారు.