శంషాబాద్ రూరల్, నవంబర్ 13 : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ ఏఎన్-124 రుస్లాన్ కార్గో విమానం గురువారం ఉదయం శ్రీలంక దేశంలోని బండారినాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది.
మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి మరో విమానాశ్రయానికి వెళ్లినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఆంటోనోవ్ విమానం వస్తున్న విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు అవసర మైన ఏర్పాట్లు చేశారు. కార్గో విమానం ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన రవాణా అవస రాలను సైతం సులభంగా అందిస్తుందని వివరించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన కార్గో విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావడం ఇది రెండోసారని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపారు.