బేగంపేట్ అక్టోబర్ 1: కుటుంబంలోని ఏ ఒక్కరికైనా కార్డియాక్ అరెస్ట్‌పై సాధారణ టెక్నిక్‌లు తెలిసి ఉండాలని ఎలక్ట్రో ఫిజియాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ హయగ్రీవారావు అన్నారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అవగాహన వారోత్సవం సందర్భంగా కిమ్స్ ఆసుపత్రిలో ఎలక్ట్రో ఫిజియాలజీ క్రిటికల్ కేర్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘ఆన్ సీపీఆర్’ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫేసింగ్, ఎలక్ట్రో ఫిజియాలజీ విభాగం డైరక్టర్ డాక్టర్ బి హయగ్రీవరావు మాట్లాడుతూ, అప్పటికే గుండెకు సంబంధించిన ఏదో ఒక సమస్య వచ్చిన వారి కుటుంబ సభ్యుల్లోంచి 60 మంది సామాన్యులను ఎంచుకొని వారికి శిక్షణ ఇప్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక రక్షకుడు ఉండాలనేదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని అన్నారు. దేశంలో ఏడాదికి 7లక్షల మంది కార్డియాక్ అరెస్ట్‌తో మరణిస్తున్నారని అన్నారు. అనంతరం, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పని చేసేవారు తప్పక సీపీఆర్ నేర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు సాధారణ టెక్నిక్‌లు నేర్చుకోవాలని సూచించారు.