కొండాపూర్, ఫిబ్రవరి 7 : ఐటీ రంగంలో హైదరాబాద్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందిందని, పెట్టుబడులకు, ఉపాధికి మంచి అవకాశాలున్నాయని నెదర్లాండ్స్ ఇండియా భూటాన్, నేపాల్ బ్రాండ్ అంబాసిడర్ మారిసా గెరాడ్స్ అన్నారు. బుధవారం ఆమె నాలెడ్స్ సిటీలోని డచ్ దేశానికి చెందిన జిబియా సీఎంఐటీ, ప్లానెన్ సాఫ్ట్వేర్ సంస్థలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తొలిసారి హైదరాబాద్‌కు వచ్చానని, ఇక్కడ వ్యాపార పెట్టుబడులను విస్తరించేందుకు స్థానికంగా ఉన్న పరిస్థితులు అధ్యయనం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కలువనున్నట్లు తెలిపారు. డచ్‌కు చెందిన 20 ఐటీ సంస్థలు ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. జిబియా డచ్ సంస్థలో 3వేల మంది ఉపాధి పొందుతున్నారని, మరింత మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జిబియా సీఓఓ కిరణ్ కుమార్ తెలిపారు.