హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్టు రామోజీ ఫిల్మ్ సిటీ(Ramojif ilm city) ముందు ఓ కారు(Car burnt )దగ్ధమైంది. క్యాబ్ డ్రైవర్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ప్రయాణీకులను దింపిన అనంతరం పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపాడు. ఈ క్రమంలో డ్రైవర్ కారు నుంచి బయటకు రాగానే వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, దోమలగూడ కు చెందిన వెంకటేష్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.