లోన్ యాప్ వేధింపులు భరించలేకపోతున్నా..
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నానంటూ ఓ వ్యక్తి తన సోదరుడికి మెసేజ్ పంపి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
వెంగళరావునగర్, జనవరి 2 : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నానంటూ ఓ వ్యక్తి తన సోదరుడికి మెసేజ్ పంపి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ఎస్ఆర్టీ నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ మతీన్ (34) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 30న బేగంపేటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడికి పలుమార్లు ఫోన్ చేశారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు తన కుమారుడు అబ్దుల్‌కు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడు. చెప్పినట్లు ఇంటికి రాకపోగా.. తన సోదరుడు మహ్మద్ అబ్దుల్ ముజాహిద్ ఫోన్‌కు ఓ మెసేజ్ పంపాడు. రుణ యాప్‌ల నిర్వాహకులు వేధింపులు భరించలేక పోతున్నాను.. తాను ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నాను.. అని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతీన్ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఎస్సై తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

