Rakhi Festival | ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీ.. బస్సులు లేక ఇబ్బంది పడుతున్న జనం
Rakhi Festival | నగరంలోని రోడ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డలు ఊర్లకు పయనమయ్యారు.
Rakhi Festival | నగరంలోని రోడ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరిం చుకుని సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డలు ఊర్లకు పయనమయ్యారు. వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ.. దాదాపు 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
అయితే సరిపడా బస్సులు లేక వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వచ్చిన బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో మరో బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రతి బస్సులో ప్రయాణికులు అధిక సంఖ్యలో తరలి వెళ్లడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనికి తోడు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బాదుడు షురూ చేయడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. కాగా, స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు సవరించామని, దూరాన్నిబట్టి 30 -50 శాతం పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని ఆర్టీసీవర్గాలు తెలిపాయి. ‘స్పెషల్ బస్’ అని రాసిలేని బస్సుల్లో అదనపుచార్జీలు వసూలు చేస్తే ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

