మారేడ్పల్లి : సికింద్రాబాద్ జేబీఎస్ ప్రధాన రహదారిలో స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న ఆదేశాల మేరకు బోయిన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ టిఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా టిఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ..బండి సంజయ్ నీకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కనీసం నియోజకవర్గం హద్దులు ఎక్కడున్నాయో తెలుసా…కేంద్ర ప్రభుత్వంనుంచి కంటోన్మెంట్కి రావాల్సిన ఏడు వందల కోట్ల బకాయిల గురించి పార్లమెంట్లో మాట్లాడే దమ్ము, దైర్యం లేదన్నారు.
మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదన్నారు. ఖబర్దార్ బండి సంజయ్ ఇంకోసారి మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే జి,సాయన్న గురించి తప్పుగా మాట్లాడితే కంటోన్మెంట్ రహదారుల పై తిరుగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.