హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్లో (Hyderabad Metro) బుల్లెట్ కలకలం సృష్టించింది. బీహార్‌కు చెందిన మహమ్మద్ అనే యువకుడు మూసాపేట ప్రగతినగర్‌లో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ బ్యాగ్‌తో మూసాపేట మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. స్కానింగ్‌లో భాగంగా భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. దీంతో అతని వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ శబ్దం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో 9 ఎంఎం బుల్లెట్ లభించింది. దీంతో మెట్రో సిబ్బంది కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.