Student Missing | ఘట్కేసర్, జూన్ 15: బీటెక్ విద్యార్థి అదృశ్యమైన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాల సమీపంలో నివాసముంటున్న ఇస్లావత్ రాహుల్(21) మున్సిపాలిటీ పరిధి అంకుషాపూర్లోని ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల14న ఎలాంటి సమాచారం లేకుండా తన రూమ్ నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని తండ్రి ఇస్లావత్ మల్లేష్ బంధుమిత్రులు, ఇతర ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోవడంతో ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన విద్యార్థి తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అదృశ్యమైన వ్యక్తి సమాచారం తెలిసినవారు సాయికుమార్ ఎస్సై 87125 80183, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ 87126 62705 కు సమాచారం ఇవ్వాలని కోరారు.