సికింద్రాబాద్, మార్చి 22: ‘అక్రమ అరెస్టులతో ప్రభుత్వాన్ని కొనసాగించలేవు రేవంత్ రెడ్డి’ అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హెచ్చరించారు. తనను పోలీసులు హైదారాబాద్ లో హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. కాగా, ఓయూలో అప్రజాస్వామికంగా ఇచ్చిన సర్య్కులర్ ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగినందుకు శనివారం ఓయూ పరిధిలోని వివిధ హాస్టల్లో విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ..తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి సర్య్కులర్ వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.