సిటీ బ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మూసీ తీరాన బీఆర్ఎస్వీ పోరుబాట ముమ్మరంగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలకు మూసీ పేరిట కాంగ్రెస్ భూ దోపిడీపై అవగాహన కల్పిస్తున్నారు. మూసీ పరీవాహక బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని ఎండగడుతున్నారు. శనివారం బీఆర్ఎస్వీ నేతలు గౌతమ్, అఖిరా నందన్ రాజు యాదవ్ తదితరులు పర్యటించారు. ఇండ్లకు మార్కింగ్లు, నోటీసులు ఇచ్చిన బాధితులను కలిసి మనోధైర్యం నింపారు.