BRSV | సికింద్రాబాద్, మార్చి 22 : అక్రమ అరెస్టులతో ప్రభుత్వాన్ని కొనసాగించలేవు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు హెచ్చరించారు. ఇందిరమ్మ పాలన అంటే అక్రమ అరెస్టులా..? అని ప్రశ్నించారు. తనను పోలీసులు హైదారాబాద్లో హౌస్ అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిర్బంధ పాలన కొనసాగిస్తున్నాడు అని మండిపడ్డారు. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు. బడ్జెట్లో ఇచ్చిన హామీకి కట్టుబడకుండా కేవలం 7 శాతం నిధులు విద్యాశాఖకు కేటాయించడంపై బీఆర్ఎస్వీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓయూ సర్క్యులర్ వెనక్కు తీసుకోవాలని నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ అరెస్టులతో ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్న అసమర్థత, దద్దమ్మ ప్రభుత్వం అని తుంగబాలు మండిపడ్డారు.