హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : మెట్రో ప్రయాణాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన ప్రభుత్వ చర్యలు మెట్రో ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పారింగ్ ప్రతిపాదనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అలాంటి ఆలోచన ఏమీ లేదని చెప్పారని శనివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సెప్టెంబర్ 15 నుంచి పెయిడ్ పారింగ్ అమల్లోకి వస్తుందని బోర్డులు దర్శనమిస్తున్నాయన్నారు. ఈ చర్యలు చూస్తుంటే మెట్రోను మరింత ప్రోత్సహించే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే సంగతి ఇక ప్రభుత్వం పట్టించుకోదని స్పష్టంగా అర్థమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.